అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొంత కాలం బాగానే గడిచినా ట్రంప్ కంటే ఊహించని స్థాయిలో ఎదురు దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి.కరోనా సమయంలో భాద్యతలు చేపట్టిన బిడెన్, ట్రంప్ కంటే మెరుగైన పాలన ఇస్తాని వాగ్దానాలు చేశారు, కరోన మహమ్మారిని తరిమి తరిమి కొడుతానని, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తానని, ఆర్ధికంగా ఆదుకుంటానని ఎన్నో హామీల వర్షం కురిపించారు.
అయితే బిడెన్ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా బెడిసి కొట్టాయి.ఒక్క హామీని కుడా బిడెన్ ఇప్పటి వరకూ పూర్తిగా నెరవేర్చలేక పోయాడనే అసంతృప్తి ప్రజల్లో నాటుకుపోయింది.
ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది అమెరికన్స్ కు బిడెన్ ప్రత్యామ్నాయం చూపించకపోగా నిరుద్యోగ బృతి అసంపూర్తిగానే అందింది.అంతేకాదు కరోనా మరణాలు ఒకానొక దశలో గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి.
వైద్య సిబ్బంది కొరత కూడా భారీగా ఏర్పడింది.ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందిన ప్రజలు బిడెన్ పై అసంతృప్తి ని వ్యక్త పరుస్తున్నా మీడియాలో ఎలాంటి కధనాలు రాలేదు.
బిడెన్ పై అమెరికన్స్ కు ఉన్న కోపాన్ని, అసంతృప్తిని అణిచిపట్టిన అమెరికన్స్ తాజాగా ఎన్నికల్లో బిడెన్ పై ఉన్న వ్యతిరేకతను ఒక్కసారిగా వెళ్ళగక్కారు.అది కూడా ఓట్ల రూపంలో.
బిడెన్ అధికారం చేపట్టి ఇంకా ఏడాది కూడా పూర్తి కాకముందే డెమొక్రాట్లకు కంచుకోటగా ఉన్న వర్జీనియా రాష్ట్ర గవర్నర్ గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి గెలుపొందటం అందరిని షాక్ కు గురిచేసింది.వర్జీనియా రాష్ట్రం డెమొక్రాట్ల కు కంచుకోట అక్కడ మరే అభ్యర్ధి గెలిచే అవకాశమే లేదు.
కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి గెలుపొందటం బిడెన్ గ్రాఫ్ పడిపోతోందంటూ గడిచిన కొంత కాలంగా అమెరికాలో పలు సర్వే సంస్థలు హెచ్చరించడం ఇందుకు నిదర్సనం అంటున్నారు.దాదాపు అన్ని రాష్ట్రాలలో డెమోక్రటిక్ పార్టీ పరిస్థితి ఇలానే ఉందని ఈస్థాయిలో బిడెన్ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణం అమెరికాలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, బిడెన్ ఇచ్చిన హామీలు నెరవేరక పోవడమేనని ,ఏది ఏమైనా బిడెన్ పాలన ఏడాది పూర్తవకుండానే ఇలా వ్యతిరేకత మూటగట్టుకోవడం భవిష్యత్తులో డెమోక్రటిక్ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు.