ప్రెగ్నెన్సీ టైమ్ అనేది పెళ్లైన ప్రతి మహిళకు ఎంతో ప్రత్యేకమైనది.ఆ సమయంలో ఎన్నో మధురానుభూతులను ఎదురవుతుంటాయి.
అలాగే అనేక సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి.అటు వంటి సమస్యల్లో నోరు చేదుగా మారిపోవడం కూడా ఒకటి.
ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.దాంతో ఏ ఆహారం రుచించగా తెగ ఇబ్బంది పడుతుంటారు.
ప్రెగ్నెన్సీ సమయంలో వాడే మందులు, ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు సంభవించడం, నోటి పరిశుభ్రత లేక పోవడం, హార్మోన్ ఛేంజస్ ఇలా రకరకాల కారణాల వల్ల నోరు చేదుగా మారిపోతుంటుంది.
అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను పాటిస్తే చాలా సులబంగా నోటి చేదుని నివారించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.నోటి చేదును తగ్గించడంలో కొబ్బరి నీళ్ళు అద్భుతంగా సహాయపడతాయి.
రోజుకు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళను సేవిస్తే నోటి చేదు వేగంగా తగ్గు ముఖం పడుతుంది.కొబ్బరి నీళ్ళే కాదు మజ్జిగ, బత్తాయి పండ్ల రసం, పుచ్చకాయ రసం, కీరా రసం వంటివి తీసుకోవడం ద్వారా కూడా నోటి చేదు దూరం అవుతుంది.
అలాగే యాలకులతోనూ నోటి చేదుకు చెక్ పెట్టవచ్చు.రెండు పెద్ద యాలకులను తీసుకుని మెత్తగా నూరి అర స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే నోటి చేదు సమస్యే ఉండదు.
నోటి చేదుతో ఇబ్బంది పడే గర్భిణీలు.నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం బ్రెష్ చేసుకోవాలి.
మరియు ఏదేనా ఆహరం తిన్న తర్వాత నోటిని తప్పకుండా నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇక నోట్లో చేదును తగ్గించుకునేందుకు పుదీనా వాటర్ కూడా గ్రేట్‌గా సమాయపడుతుంది.
ఒక గ్లాస్ వాటర్‌లో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి సేవించాలి.ఇలా చేయడం ద్వారా నోటి చేదు తగ్గు ముఖం పడుతుంది.
.