జిడ్డు చర్మం చాలామంది భారతీయులకి ఉంటుంది.ఏం చేస్తాం, మన జీన్స్, వాతావరణం, డైట్ అలాంటివి.
ఇక ఈ సమ్మర్ లో చర్మం జిడ్డుగా మారడం ఇంకా కామన్.జిడ్డు చర్మం చాలా ఇబ్బంది పెడుతుంది.
ముఖంలో కళ పోగొడుతుంది.మన చర్మం నిస్సారంగా కనబడేలా చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే మొటిమలకు కారణమై అందాన్ని చెడగొడుతుంది.మీది కూడా జిడ్డు చర్మమేనా ? మీరు కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారా ? అయితే కంగారుపడోద్దు.మీకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి మాదగ్గర.
* ముఖం జిడ్డుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి.జీన్స్ ఓ కారణమైతే మన అలవాట్లు పెద్ద కారణం.ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకునే అలవాటు లేకపోవడం, ప్రోటీన్ ఉన్న ఆహరం తక్కువగా తినడం, నీళ్ళు తక్కువగా తాగడం, ఫ్యాట్స్, ఆయిల్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి .ఇదిగోండి ఇలాంటి కారణాలు ఉనాయి.అందుకే వీటికి దూరంగా ఉండండి.
* ముఖాన్ని రోజుకి రెండు లేదా మూడు సార్లు శుభ్రపరుచుకోండి.నేచురల్ క్లీన్సేనర్ వాడండి.
మైల్డ్ సబ్బులు మాత్రమే వాడండి.ఎండకి ఎక్కువగా చర్మాన్ని ఎక్స్పోజ్ చేయవద్దు.
కుదిరితే డాక్టర్ సజెస్ట్ చేసే సన్ స్క్రీన్ లోషన్ వాడండి.నేచురల్ స్క్రబ్స్, అంటే అరటి తొక్క, అరేంజ్ తొక్క, నిమ్మకాయ తొక్క, కలబంద .వీటిని క్లీనింగ్ కి వాడండి.ఎప్పుడు కాటన్ బాల్స్ తో ముఖాన్ని తుడుచుకోవడం అలవాటు చేసుకోండి.
రోజ్ వాటర్, ఆలీవ్ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనే, నిమ్మరసం వాడండి ముఖాన్ని కడుక్కునేటప్పుడు.
* ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వద్దు.
స్తీమ్ద్ ఫుడ్స్ ఎక్కువగా తినండి.డయిరి ప్రాడక్ట్స్, చాకొలేట్, కూల్ డ్రింక్స్, షుగర్, స్వీట్స్, యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్న డ్రింక్స్,బయట దొరికే చైనీస్ ఫుడ్, ఇవన్ని మానేయండి.
ఎగ్ వైట్స్ తినండి.ఇడ్లీ తీసుకోండి.
పండ్లు తినండి.బాయిల్ చేసిన నీళ్ళు బాగా తాగండి.
స్తీమ్ద్ మాంసాహారం తీసుకోండి.
* టవల్ రోజు ఉతుక్కోవాలి.
టవల్ మారుస్తూ ఉండాలి.ముఖంపై ఆయిల్ వచ్చేంతసేపు చూస్తూ కూర్చుకూడదు.
ఒట్ మీల్ ఫేస్ ప్యాక్, కుకుంబర్ ఫేస్ ప్యాక్, తేనే ఫేస్ ప్యాక్, అరటి ఫేస్ ప్యాక్, పుదీనా, వేప, కలబంద .ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వాడుతూ, ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకుంటూ ఉండాలి.మంచి మాయిశ్చరైజర్ కూడా వాడాలి.
* హర్మోనల్ ఇమ్బ్యాలేన్స్ వలన జిడ్డు పెరుగుతుంది.కాబట్టి ముభావంగా ఉండొద్దు.స్ట్రెస్ తీసుకోవద్దు.
నలుగురితో ఉండండి, నవ్వుతూ ఉండండి.కామెడి సినిమాలు చూడండి.
మొత్తానికి నవ్వెందుకు కారణాలు వెతుక్కోండి.ఒత్తిడి ఉన్న మనిషి అందంగా ఉండలేడు.
నవ్వితేనే అందం, ఆరోగ్యం.