డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఎంతో ఆశ ఉంటుంది.ఈ క్రమంలోనే డబ్బు సంపాదించడం కోసం రాత్రి పగలు కష్టపడుతుంటారు.
అయితే ఇలా సంపాదించిన డబ్బు మొత్తం కొన్నిసార్లు వృధా ఖర్చులు గా వెళ్ళిపోతుంది.కొందరికి ఎంత కష్టపడి సంపాదించిన చేతిలో డబ్బు నిలువదు.
అయితే మనం సంపాదించే డబ్బు సరైన మార్గంలో సంపాదిస్తేనే ఆ లక్ష్మీదేవి మన చెంత ఉంటుంది.ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పాలు ఇచ్చే ముందు తప్పనిసరిగా ఈ పద్ధతులు పాటించాలని పండితులు చెబుతున్నారు.
సాక్షాత్తు మన ఇంట్లో ఉన్న మహిళలను లక్ష్మీదేవిగా భావిస్తారు.మన ఇంట్లో సంపద పెరగాలన్నా నాశనం అవ్వాలన్న ఇంట్లో ఉన్న మహిళల పై ఆధారపడుతుంది.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం మహిళలు ఇంటిలో శుభ్రంగా ఉంచి లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు కోసం ఎన్నో పూజలు చేస్తారు.ఈ క్రమంలోనే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినది కనుక సాక్షాత్తు పాలను కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
కనుక మన పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పాలు కాచేటప్పుడు ఈ పద్ధతులు పాటించాలి.
ఉదయం మహిళ పాలు కాచే ముందుగా ఇంట్లో పొయ్యి శుభ్రంగా కడిగి పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాతనే పాలు కాచాలి.పొరపాటున చాలామంది పాలను పొంగిస్తారు.ఇలా పాలు పొంగిన తర్వాత ఆ పాలలో రెండు బియ్యపు గింజలు వేయడం వల్ల శుభం కలుగుతుంది.
అదేవిధంగా చాలామంది పాలు కాంచిన తర్వాత చల్లారడం కోసం మూత తీస్తారు.ఇలా మూత తీసి పెట్టడం వల్ల పాల నుంచి వెళ్లే ఆవిరి మాదిరి మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా ఆవిరైపోతుందని పండితులు చెబుతున్నారు.
కనుక పాలను కాల్చేటప్పుడు పొయ్యికి పూజ చేసి పాలు కాంచడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.
DEVOTIONAL