బిగ్ బాస్ సీజన్-5 జోషల్ ఫుల్ గా షురూ అయ్యింది.అదరగొట్టే ప్రదర్శనల నడుమ 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఒక్కో పార్టిసిపెంట్ గురించి హోస్ట్ నాగార్జున వివరిస్తూ హౌస్ లోకి ఆహ్వానించాడు.అందులో భాగంగా 7 నెంబర్ పార్టిసిపెంట్ గా హౌస్ లోకి వచ్చింది సీనియర్ నటి ప్రియ.
పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఈ నటీమణి.జనాలకు బాగా దగ్గరయ్యింది.
అటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందు ప్రియకు సంబంధించిన ఏవీని ప్రదర్శించారు.తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో ప్రదర్శించారు.
అటు ఈ ఏవీ తర్వాత తన రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను బయటకు చెప్పింది ప్రియ.ఎన్నో కలలు కని చేసుకున్న పెళ్లి కొంత కాలానికే పెటాకులైనట్లు చెప్పింది.
ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకి దూరంగా ఉంటున్నట్లు చెప్పింది.ఒంటరి మహిళగా తను పడి ఇబ్బందులను వివరించింది.
తన పిల్లల గురించి సైతం పలు విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యింది.
అటు బిగ్ బాస్ తన జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ కావాలని భావిస్తున్నట్లు చెప్పింది.తన కళ్ల ముందు చాలా మంది హీరోయిన్లు వచ్చిపోతున్నా.
ఇంకా తాను నటిగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పింది.తాను అందరికీ దూరంగా ఒంటరిగా ఉండగలనా? అని చెక్ చేసుకునేందుకు ఈ అవకాశం తను బాగా ఉపయోగపడుతుందని చెప్పింది.
బిగ్ బాస్ వేదికగా ప్రియకు నాగార్జున ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు.సింగపూర్ లో ఉన్న ప్రియ కుమారుడి వీడియోను ప్రదర్శించాడు.తనకు విషెష్ చెప్తున్న కొడుకును చూసి ప్రియ సంతోషం వ్యక్తం చేసింది.చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాతో ప్రియ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత చిరంజీవి, పవన్, వెంకటేష్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ సహా పలువురు అగ్ర నటులతో ప్రియ నటించింది.దాదాపు 60 సినిమాల్లో నటించింది.20 ఏండ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.