శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పండుగగా దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారని మనకు తెలిసిందే.
ప్రతి ఒక్క సోదరి తన జీవితంలో ఎలాంటి సమయంలోనైనా తనకు తోడుగా రక్షణగా తన సోదరుడు ఉండాలని భావించి తన సోదరికి రాఖీ కడుతుంది.ఈ విధంగా సోదరి కట్టిన రాఖీ వల్ల తన సోదరుడు జీవితంలో అభివృద్ధి సాధించాలని తను ఎంతో ఆరోగ్యంగా ఉండాలని భావించి తన సోదరుడికి రాఖీ కడుతుంది.
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి నేడు ఆగస్టు 22న వచ్చింది.ఈ క్రమంలోనే చంద్రుడు ఈరోజు కుంభ రాశిలో ఉన్నాడు.గురుడు కూడా అదే రాశిలో ఉండటం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా గురుడు కుంభరాశి కలయిక వల్ల ద్వాదశ రాశుల పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది.
అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజు కొన్ని రాశుల వారికి శుభయోగం కలుగుతుంది.మరి ఆ రాశులు వారు ఎవరో? ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం…
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు.రాఖీ పౌర్ణమి రోజు గురుడుతో కలిసి గజకేసరి యోగం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ఎంతో అదృష్టం అని చెప్పవచ్చు.ఈ రాశి వారికి ఎప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది.ఈ రాశి వారికి ఆదాయం పెరగటమే కాకుండా ప్రతి ఒక్కరు సహకారం లభిస్తుంది.
ధనస్సు రాశి:
గజకేసరి యోగం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది.పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులు పూర్తవుతాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.మీరు చేసే పనిలో విజయం దక్కుతుంది.
మీన రాశి:
ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అయితే ఇకపై ఇబ్బందులకు స్వస్తి చెప్పే సమయం వచ్చింది.ఈ సమయంలో ఏ రాశి వారు చేపట్టే పనులన్నీ ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి.
ఈ రాశి వారికి గజకేసరి యోగం ప్రభావం అధికంగా ఉండటం వల్ల అంతా శుభం కలుగుతుంది.
DEVOTIONAL