మన హిందూ పురాణాల ప్రకారం లోకకళ్యాణార్థం రాక్షసులను సంహరించడానికి కోసం విష్ణుమూర్తి ఏకంగా దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి రాక్షసులను సంహరిస్తూ ధర్మం వైపు నిలబడ్డారు.
ఈ విధంగా విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాల్లో చాలామందికి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, నరసింహ అవతారాలు మాత్రమే చాలావరకు తెలిసి ఉంటాయి.కానీ విష్ణుమూర్తి హయగ్రీవుడు అవతారం కూడా ఎత్తారు.
అసలు విష్ణుమూర్తి ఈ విధమైన అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుడు గుర్రం తలను పోలి ఉండి బ్రహ్మ కోసం కఠినమైన తపస్సు చేశాడు.ఈ క్రమంలోనే బ్రహ్మదేవుడు నుంచి తన చావు కేవలం తన మాదిరి పోలిక ఉన్న వారి చేతులలోనే తనకు మరణం సంభవించాలని కోరాడు.
ఈ విధంగా బ్రహ్మదేవుడు వరకు ఇవ్వడంతో హయగ్రీవుడు ఎంతో గర్వంతో అందరినీ ఎన్నో చిత్రహింసలకు గురి చేసే వాడు.ఈ క్రమంలోనే రుషులు, మునులు ఆ రాక్షసుడు నుంచి విముక్తి కావాలని ఆ పార్వతీ పరమేశ్వరులను శరణు వేడాడు.
యోగ నిద్రలో ఉన్న విష్ణు మూర్తిని నిద్ర లేపితే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని పార్వతీదేవి చెప్పింది.ఆ సమయంలో విష్ణు గడ్డం కింద పెట్టుకొని నిద్ర పోతున్నాడు.
విష్ణుమూర్తి నిద్ర లేపడం కోసం పరమేశ్వరుడు చెదపురుగుగా మారి వింటి తాడును తెంపుతాడు.ఆ సమయంలో విల్లు పైకి వెళ్లడంతో విష్ణు తల తెగిపడుతుంది.ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆదిదంపతులు విష్ణుమూర్తికి గుర్రం తల తీసుకువచ్చి పెడతారు.ఈ క్రమంలోనే దేవతలందరూ కలిపి తమ జ్ఞానాన్ని శక్తిసామర్థ్యాలను గుర్రం తల ఉన్నటువంటి శ్రీమహావిష్ణువు ధారపోస్తారు.
ఇంతమంది దేవతలు జ్ఞానాన్ని ప్రసాదించడంతో హయగ్రీవుడు విద్యకు ప్రదాత అయ్యాడు.ఈ క్రమంలోనే రాక్షసరాజైన హయగ్రీవుడుని చంపి లక్ష్మీ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చాడు.
అయితే విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ మాస పౌర్ణమి కావడంచేత ఈరోజు హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.ముఖ్యంగా స్వామి వారికి ఎంతో ఇష్టమైన యాలకలు మాలతో, తెల్లని పుష్పాలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా సెనగ గుళ్ళు స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది.
DEVOTIONAL