మళ్లీ వణికిపోతున్నా మహారాష్ట్ర వాసులు.. ప్రజలకు సీఎం వార్నింగ్ !!

దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి నుండి వార్తల్లో నిలుస్తోంది.కరోనా ప్రారంభంలో అదేరీతిలో కరోనా సెకండ్ వేవ్ టైం లో భారీ స్థాయిలో మహారాష్ట్రలో కేసులు బయటపడ్డాయి.

 Delta Varient Plus Cases More In Maharashtra Cm Uddhav Thackeray, Maharashtra, D-TeluguStop.com

దేశంలో అన్ని రాష్ట్రాలలో వైరస్ కంట్రోల్ అవుతున్న మహారాష్ట్రలో మాత్రం కేసులు.ఉన్న కొద్ది పెరుగుతూ ఉండటం అప్పట్లో కేంద్రానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది అని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వాలు ఊపిరిపీల్చుకున్న తరుణంలో ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ఇప్పుడు మహారాష్ట్రలో భారీగా నమోదు కావడం ప్రభుత్వాలకు టెన్షన్ పుట్టిస్తుంది.

ప్రపంచ దేశాలలో ఈ వేరియంట్ అన్నిట్లో కల్లా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా పూణే, అహ్మద్ నగర్, సోలాపూర్,… ఇంకా మరి కొన్ని జిల్లాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందని.ప్రభుత్వాలు వార్నింగ్ ఇస్తున్నాయి.

ఈ క్రమంలో మహా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి… డెల్టా వేరియంట్ బాధితులు ఎక్కడెక్కడ పర్యటించారు.? ఎవరితో కాంటాక్ట్ అయ్యారు.? టీకా వేసుకున్నారా.? లేదా.? అనే వివరాలు అనుకుంటున్నట్లు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Telugu Cmuddhav, Corona Wave, Delta, Maharashtra-Latest News - Telugu

డెల్టా వేరియంట్ నుండి ఉద్భవించింది డెల్టా వేరియంట్ ప్లస్.ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వేరియంట్ ఇప్పుడు మహారాష్ట్రలో బయటపడటం.తో కేంద్రం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే లాక్ డౌన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

త్వరలో వినాయకచవితి మరి కొన్ని పండుగలు వస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube