రిలీజ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేయ‌ని ర‌ఘురామ‌.. ఇంకా క‌స్ట‌డీలోనే...?

ఏపీలో ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గా ఉందో అంద‌రికీ తెలిసిందే.అయితే ఆయ‌న మాత్రం ఇప్పుడు వ‌రుస చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.

 Raghurama Krishnam Raju Not Signed On Release Order, Mp Raghurama Krishnam Raju,-TeluguStop.com

ఇప్పుడు తాజాగా ఆయ‌న‌కు మ‌రో షాక్ త‌గిలింది.ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట ఉండ‌గా.

ఇక్క‌డే ఆయ‌న ఓ మిస్టేక్ చేశారు.గ‌త‌నెల మే21న సుప్పీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ కొన్నిష‌ర‌తులు కూడా పెట్టింది.

అయితే బెయిల్ ఇచ్చిన రోజు నుంచి స‌రిగ్గా ప‌ది రోజుల్లో గుంటూరులోని సీఐడీ కోర్టుకు బెయిల్ కు సంబంధించిన ముఖ్య‌మైన బాండ్లను అప్ప‌జెప్పాల‌ని సుప్రీంకోర్టు బెయిల్ తీర్పులో వెల్ల‌డించింది.కానీ ర‌ఘురామ మాత్రం ఆ ప‌నిచేయ‌కుండా ఆర్మీ ఆస్ప‌త్రి నుంచి 24వ తేదీన డిశ్చార్జి అయి డైరెక్టుగా హ‌స్తిన‌కు ప‌య‌న‌మ‌య్యారు.

ఆ త‌ర్వాత 28వ తేదీన ఎంపీ తరఫున వాదిస్తున్న లాయ‌ర్లు గుంటూరులోని సీఐడీ కోర్టులో షూరిటీ ఆర్డ‌ర్లు అంద‌జేశారు.దాంతో కోర్టు కూడా ఎంపీ బెయిల్ కు అటాచ్ చేసే రిలీజ్‌ ఆర్డర్‌ను జిల్లా కేంద్రంలోని జైలుకు జారీ చేసింది.

Telugu Mpraghurama, Cbi, Cbi Officers, Supreme-Political

అయితే ఆ రిలీజ్ ఆర్డ‌ర్ల‌ను ఆర్మీ ఆస్ప‌త్రికి పంపించ‌గా ర‌ఘురామ అప్ప‌టికే డిశ్చార్జి అయి ఢిల్లీకి వెళ్లారు.కాగా ఆ రిలీజ్ ఆర్డ‌రుపై ర‌ఘురామ సంత‌కం చేయ‌లేదు.వాటిని ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు తిరిగి గుంటూరు జైలుకే పంపించాయి.సంతకం చేయకపోవ‌డంతో ర‌ఘురామ టెక్నిక‌ల్‌గా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లే అవుతుంది.దీన్ని కోర్టు కూడా ఆమోదిస్తూ ఆయన రిమాండ్‌ను కాస్తా జూన్ 25వ తేదీ దాకా పొడిగించింది.ఇక దొరికిందే అవ‌కాశం అన్న‌ట్టు సీఐడీ ఆఫీస‌ర్లు ర‌ఘురామ‌ను త్వ‌ర‌లోనే గుంటూరుకు ర‌ప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ‌పై చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ అయితే హంసపాల్ రీసెంట్‌గా స్థానిక ఎస్పీకి లేఖ రాసి ఫిర్యాదు చేశారు ఆయ‌న‌.దీంతో ఆయ‌న క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube