ఆస్త‌మానా..? అయితే మీరు ఆవ నూనె వాడాల్సిందే!

ఆస్త‌మా.దీనినే ఉబ్బ‌సం అని కూడా పిలుస్తారు.పిల్లలు.పెద్ద‌లు, స్త్రీలు.పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో బాధిస్తున్న స‌మ‌స్య ఇది.వాయు నాళాలు వాచిపోవ‌డం వ‌ల్ల ఆస్త‌మా బారిన ప‌డ‌తారు.దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి.ఈ ఆస్త‌మా ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత కాలం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ఈ వ్యాధి ఉన్న వారు కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా.ఊపిరి స‌రిగ్గా అంద‌క ఎంతో ఇబ్బంది ప‌డిపోతుంటారు.

 Mustard Oil, Asthma, Benefits Of Mustard Oil, Mustard Oil For Health, Health Tip-TeluguStop.com

ఇక ఆస్త‌మాను పూర్తిగా నివారించే చికిత్స లేక‌పోయినా.అదుపు చేసే ఇన్హేలర్లు, మందులు అందుబాటులో ఉన్నాయి.

అలాగే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటించ‌డం ద్వారా కూడా ఆస్త‌మాను అదుపు చేసుకోవ‌చ్చు.ముఖ్యంగా ఆవ నూనె ఆస్త‌మాను కంట్రోల్ చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. ఆవ నూనె ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.ఆవ నూనెలో ఎన్నో ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, గుడ్ ఫ్యాట్స్ నిండి ఉంటాయి.

అందుకే ప‌లు రాష్ట్రాల్లో వంట‌ల‌కు ఆవ నూనెను ఎక్కువ‌గా వాడుతుంటారు.

Telugu Asthma, Asthma Control, Tips, Latest, Mud Oil-Telugu Health - తెల

ముఖ్యంగా ఆస్త‌మా వ్యాధితో బాధ ప‌డే బాధితులు.ఆవ నూనెను యూజ్ చేస్తే మంచి రిలీఫ్ పొందుతారు.అవును, ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెను ఉదరం, ఛాతీకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శ్వాసనాళంకు గాలి బాగా ఆడుతుంది, నాజల్ ఫ్రీ అవుతుంది.

అలాగే ఆవ నూనెతో త‌యారు చేసిన వంట‌లు తీసుకుంటే వాయు గొట్టాల వాపు త‌గ్గుతుంది.

ఇక ఆస్త‌మాను అదుపు చేయ‌డ‌మే కాదు.

నొప్పి నివార‌ణగా కూడా ఆవ నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది.కీళ్ల నొప్పి, న‌డుపు నొప్పి, మెడు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు.

సంబంధిత ప్రాంతంలో ఆవ నూనె కాస్త గోరు వెచ్చ‌గా చేసి రాస్తే.వెంట‌నే రిలీఫ్ పొందుతారు.

అలాగే ఆవ నూనె వంట‌ల్లో ఉప‌యోగిస్తే.గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube