తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారిందట.కాగా ఇటీవల కరోనా బారినపడిన నరసింహులు చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్దితి ఆందోళనకరంగా మారడంతో ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలో నరసింహులు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారట.ఇకపోతే టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబుతో విభేదించారు.ఇదే కాకుండా టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద సంచలన ప్రకటన చేసి ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.కాగా ఈ ఏడాది జనవరిలో బీజేపీ లో చేరిన మోత్కుపల్లి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.