అక్కినేని సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం.గుణశేఖర్ అంటే ప్రత్యేకమైన సినిమాలను తెరకెక్కిస్తాడని అందరికి తెలుసు.
గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సమంత తొలిసారి పౌరాణిక సినిమాలో నటిస్తుంది.
అంతేకాదు ఈ సినిమా కోసం సమంత ఏకంగా 150 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.పెళ్లి తర్వాత సమంత ఆచూతూచి సినిమాలను ఒప్పుకుంటుంది.
ఎక్కువుగా లేడీ ఓరియెంటెడ్ సినిమా లను చేస్తూ వరుస హిట్స్ కొడుతోంది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తున్నాడు.మలయాల స్టార్ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.
అంతే కాదు దుర్వాస ముని పాత్ర లో మోహన్ బాబు నటిస్తున్నట్టు సమాచారం.గుణశేఖర్ ఈ సినిమాలో నటించే నటీనటు లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే ఇతిహాస కథతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీ నటులు ఎంపిక చాలా అవసరం.అందుకే గుణశేఖర్ అత్యంత ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు.అయితే ఈ సినిమా కోసం గుణశేఖర్ మరొక టాలెంటెడ్ బ్యూటీ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో మరొక కీలక పాత్ర కోసం తమిళంలో పాపులర్ అయినా ఒక హీరోయిన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.తమిళంలో అరువి చిత్రంతో పాపులర్ అయిన అదితి బాలన్ శాకుంతలం మూవీలో కీలక పాత్ర లో ఎంపికయ్యారు.
అదితి ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఈమె పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.