మహానటి సినిమా పేరు వినిపిస్తే సావిత్రిలా కనిపించే కీర్తిసురేష్ రూపం కళ్లముందు మెదులుతుంది.సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి కీర్తి సురేష్ ఆ పాత్రను అద్భుతంగా పోషించారు.
కీర్తి సురేష్ సినీ కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే మహానటి సినిమాకు ముందు మహానటి సినిమా తరువాత అని చెప్పాల్సి వస్తుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టడంతో పాటు కీర్తి కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచింది.
అయితే ఒక విధంగా మహానటి సినిమా కీర్తి కెరీర్ కు ప్లస్ అయినా మరో విధంగా మాత్రం మైనస్ అయింది.మహానటి తరువాత కీర్తి సురేష్ ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెను ఆ పాత్రతో పోల్చి చూడటంతో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
అయితే కీర్తి నటించిన రంగ్ దే సినిమా ఈ గురువారం విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నితిన్ కీర్తి సురేష్ మహానటి కాదని మహానాటు అంటూ కామెంట్లు చేశారు.
అఆ సినిమాతో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నాకు హిట్ ఇచ్చిందని.ఆ తరువాత భీష్మ సినిమాతో మరో హిట్ ఇచ్చిందని.ప్రస్తుతం రంగ్ దే సినిమాతో ఈ బ్యానర్ తనకు మరో హిట్ ఇవ్వబోతుందని నితిన్ అన్నారు.చాలామంది కీర్తి సురేష్ ను చూడగానే మహానటి అని అంటారని కానీ కీర్తి సురేష్ మాత్రం మహానటి కాదని మహానాటు అని సినిమాలో పాత్రలో కీర్తి బాగా నటించినా తనను మాత్రం టార్చర్ చేసిందని చెప్పారు.
రంగ్ దే మూవీ ద్వారా కీర్తి సురేష్ తో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండేంత బంధం ఏర్పడిందని.దర్శకుడు వెంకీ అట్లూరితో తనకు 12 సంవత్సరాలుగా పరిచయం ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు.
వెంకీ అట్లూరి లైఫ్ లో ఎన్ని ప్రేమకథలు ఉన్నాయో తనకు తెలీదు కానీ కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయని ఉన్నాయని వెల్లడించారు.