ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్.
షర్మిల తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఒక తేనె తుట్టను కదిపారు. ఆమె పార్టీ పెట్టడం దాదాపు ఖాయం కావడంతో ఏ పార్టీకి బ్యాండ్ పడిపోతుంది ? ఆమె వల్ల ఎవరి ఓట్లు చీలుతాయి.ఎవరితో ఆమె లోపాయకారీ పొత్తు పెట్టుకుంటారు అన్న విషయాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.కొందరు షర్మిలను కేసీఆరే రంగంలోకి దించారని చెపుతుంటే.
మరి కొందరు మాత్రం ఆమెను బీజేపీయే లైన్లోకి తీసుకు వచ్చిందని ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు.ఈ సంగతులు అలా వుంచితే, అసలు ఆమె పార్టీ పెట్టాల్సిన అవసరాన్నే ప్రశ్నించడం మొదలుపెట్టేసారు.
ఇక తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి షర్మిల కొత్త పార్టీపై స్పందించారు.ఎందుకంటే షర్మిల పార్టీ వల్ల రెడ్లలో చీలిక వస్తే ముందుగా నష్టపోయేది కాంగ్రెస్సే కావడంతో ఆ పార్టీ నేతలు ఎలెర్ట్ అవుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే రేవంత్ స్పందించారు.వైఎస్ కుమార్తెగా షర్మిల అంటే మాకు ఎంతైనా గౌరవం ఉందని చెప్పారు.ఆమె తెలంగాణలోకి వస్తే ఆడబిడ్డగా ఆదరించి, సారె, చీర పెడతామని, కష్టంతో వస్తే ఆదుకుంటామని, అంతే తప్ప అధికారం చేపట్టడానికి వస్తే అంగీకరించేది ఏ మాత్రం వీల్లేదని క్లారిటీ ఇచ్చేశారు.
ఇక తాము ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్నది.తెలంగాణ వాళ్లు తెలంగాణను పాలించుకోవడానికే తప్పా వేరే వాళ్ల కోసం కాదని రేవంత్ కుండబద్దలు కొట్టేశారు.ఏదేమైనా షర్మిల గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతలు షర్మిల పార్టీకి ఆంధ్ర రంగు పూసే పని స్టార్ట్ చేసేసారు.ఏదేమైనా షర్మిల కొత్త పార్టీ ప్రకటన రాకుండా ఆమెను టార్గెట్ చేసే పని అయితే మొదలు పెట్టేశారు.