సాధారణంగా ఎవరైనా మృతి చెందింతే.వారికి దహనం లేదా ఖననం చేసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు.వారికి అంతిమ వీడ్కోలు పలకడం సహజమే.కానీ, ఒక కూతురు తన తల్లి కోసం ఏం చేసిందో తెలిస్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.తన తల్లి మృతదేహాన్ని ఒకటి, రెండు రోజులు కాకుండా ఏకంగా పదేళ్లపాటు ఫ్రిడ్జ్ లో దాచింది.ఈ సంఘటన వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.
కానీ, ఇది వాస్తవంగా చోటు చేసుకుంది.ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.?! జపాన్ రాజధాని టోక్యో నగరంలో.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
టోక్యో లోని ఒక అపార్ట్మెంట్ లో యుమి యోషినో అనే మహిళ తన తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తుంది.ఇది ఇలా ఉండగా గత నెల ఇంటి ఓనర్ కు అద్దె కట్టకుండా ఉండిపోయింది.
దీంతో ఆమెను ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాగా, ఎంత చెప్పినా కూడా ఆ మహిళ వినిపించుకోలేదు.దీనితో ఆ మహిళపై ఓనర్ కు అనుమానం తలెత్తగా వెంటనే పోలీసులను సంప్రదించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు పూర్తి వ్యవహారాన్ని బయట పెట్టారు.
ఫ్రిజ్ లో ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి పోలీసులు, ఇంటి ఓనర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.వెంటనే పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.విచారణలో భాగంగా ఎందుకిలా చేశావని ఆ మహిళను ప్రశ్నించగా తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేకపోయానని, అందుకే ఇలా చేసానని తెలియజేసింది.
తన తల్లి చనిపోయిన నాటికి 60 సంవత్సరాలు వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ సంఘటన అక్కడి స్థానికులకు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా కానీ, ఇలా చేయడం సరికాదని పోలీసులు యోషినో ను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే ఆమె తల్లి మృతదేహాన్ని అపార్ట్మెంట్ నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.