“అతనొక్కడే” చిత్రం విడుదల అయినప్పుడు 2005 లో కళ్యాణ్ రామ్ పక్కాగా ఒక మంచి స్టార్ హీరో అవుతాడు అని అంత అనుకున్నారు.ఈ సినిమా విజయం సాధించింది.
ఆ తర్వాత వచ్చిన అసాద్యుడు సినిమా కమర్షియల్ గా మంచి మాస్ సినిమా కానీ ఎందుకో కళ్యాణ్ రామ్ కి వర్క్ అవుట్ కాలేదు.ఈ సినిమా తర్వాత వచ్చిన హరే రామ్ సినిమా లో డిఫరెంట్ పాత్రల్లో నటించిన కూడా పెద్ద హిట్ అవ్వలేదు.
ఇక కత్తి సినిమా కంటెంట్ బాగానే ఉన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు.ఎన్ని సినిమాలు చేసిన, ఎన్ని వేరియేషన్స్ చూపించిన కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసిన అవుట్ ఫుట్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది.
ఎక్కడ తేడా కొట్టిందో కానీ మొత్తంగా కళ్యాణ్ రామ్ ఎంత కసిగా సినిమాలు చేసిన రిజల్ట్ మాత్రం ఒకేలా వచ్చింది.పటాస్ వంటి సినిమాతో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత మళ్లి ఎదో విధంగా గాడిన పడ్డ కూడా ఆ తర్వాత సైతం అన్ని పరాజయాలు పలకరించాయి.118 సినిమా సైతం పెద్దగా జనాలకు ఎక్కలేదు.ఇక హీరోగా ఎలాగూ వర్క్ అవుట్ కావడం లేదు బకాబ్బటి నిర్మాతగా మారి కిక్ సీక్వెల్ కి జై లవ కుశ సినిమాకు బాగానే వర్క్ అవుట్ చేసుకున్నాడు.ఇక టాలీవుడ్ మొత్తం కోడై కూసే ఒకే మాట ఏంటంటే కళ్యాణ్ రామ్ కి సినిమా ఇండస్ట్రీ కి జనాలను పరిచయం చేయడం లో మంచి హ్యాండ్ ఉందని.

అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి వంటి వారికి కళ్యాణ్ రామ్ తొలి అవకాశం ఇచ్చాడు.అసాధ్యుడు, కత్తి, 118, MLA, జయీభవ, ఓం 3D చిత్రాలకు కూడా కొత్తవారికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు.ఇన్నేళ్ల పాటు ప్రయోగాలు చేయకుండా సొంత నిర్మాణం లో సినిమాలు చేసి ఉంటె బాగా కలిసి వచ్చేది.సినిమాను ప్రేమిస్తూ, కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ, కొత్త కొత్త సినిమాలను తీయడం లో కళ్యాణ్ రామ్ ముందుటాడు.
ఇక చివరగా బింబి సార సినిమాను తన సొంత నిర్మాణం లో తీసి హిట్ కొట్టాడు.ఇక దీని సీక్వెల్ పై దృష్టి పెట్టాడు.ఇకనైనా కళ్యాణ్ రామ్ కెరీర్ ఎక్కడ ఆగకుండా ముందుకు సాగాలని కోరుకుందాం.