ఆ దేవాలయంలో 400 సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది.. ఎక్కడంటే?

సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలో దీపాలు వెలుగుతూ ఉండడం సర్వసాధారణమే అయినప్పటికీ ఈ విధంగా ఏళ్లతరబడి దీపాలు వెలగడం ఎంతో అరుదు.దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటే అక్కడ చీకటి తొలగించబడుతుందని చెబుతుంటారు.

 Reason Behind Lamp Lightening From 400 Years, 400 Years, Temple Lasting, Lamp Be-TeluguStop.com

అందుకోసమే మన సాంప్రదాయం ప్రకారం ఎటువంటి శుభకార్యం జరిగినా మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దీపం గత 400 సంవత్సరాలనుంచి వెలుగుతూ ఉందంటే ఎంతో ఆశ్చర్యం గానే ఉంటుంది.

ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయం ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా, ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది.ఈ ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రులు కోరిన కోరికలను నెరవేర్చే దేవుడిగా గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం.ఈ ఆలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతూనే ఉంది.ఈ ఆలయంలో ఈ అఖండ దీపం ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటేనే ఆ గ్రామంలో ప్రజలు సిరి సంపదలతో సంతోషంగా గడుపుతారు అనేది అక్కడి ప్రజల నమ్మకం.

Telugu Lamp, Rajanna, Telangana, Temple-Latest News - Telugu

ఈ గ్రామ ప్రజలు నిత్యం ఈ శ్రీరామచంద్రుల వారికి దీప, ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలతో పూజిస్తారు.ఈ ఆలయంలో వెలిగే నందా దీపం అనే ఆ జ్యోతి గత 400 సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉందని చరిత్ర చెబుతోంది.ఈ దీపం వెలిగితేనే ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.ఈ దీపం వెలుగుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలు కోరిన కోరికలను నెరవేర్చే స్వామివారిగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీరామచంద్రుల వారికి ప్రతి సంవత్సరం పీచర వంశానికి చెందిన వారు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు.ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube