ఆ దేవాలయంలో 400 సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది.. ఎక్కడంటే?
TeluguStop.com
సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలో దీపాలు వెలుగుతూ ఉండడం సర్వసాధారణమే అయినప్పటికీ ఈ విధంగా ఏళ్లతరబడి దీపాలు వెలగడం ఎంతో అరుదు.
దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటే అక్కడ చీకటి తొలగించబడుతుందని చెబుతుంటారు.అందుకోసమే మన సాంప్రదాయం ప్రకారం ఎటువంటి శుభకార్యం జరిగినా మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దీపం గత 400 సంవత్సరాలనుంచి వెలుగుతూ ఉందంటే ఎంతో ఆశ్చర్యం గానే ఉంటుంది.
ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయం ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా, ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది.
ఈ ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రులు కోరిన కోరికలను నెరవేర్చే దేవుడిగా గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం.
ఈ ఆలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతూనే ఉంది.ఈ ఆలయంలో ఈ అఖండ దీపం ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటేనే ఆ గ్రామంలో ప్రజలు సిరి సంపదలతో సంతోషంగా గడుపుతారు అనేది అక్కడి ప్రజల నమ్మకం.
"""/" /
ఈ గ్రామ ప్రజలు నిత్యం ఈ శ్రీరామచంద్రుల వారికి దీప, ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలతో పూజిస్తారు.
ఈ ఆలయంలో వెలిగే నందా దీపం అనే ఆ జ్యోతి గత 400 సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉందని చరిత్ర చెబుతోంది.
ఈ దీపం వెలిగితేనే ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.ఈ దీపం వెలుగుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలు కోరిన కోరికలను నెరవేర్చే స్వామివారిగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీరామచంద్రుల వారికి ప్రతి సంవత్సరం పీచర వంశానికి చెందిన వారు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
చలికాలంలో కాకరకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?