కరోనా వైరస్ కారణంగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్స్, దేవాలయాలు అన్ని కూడా తిరిగి తెరచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ తరుణంలో కొన్ని ఆలయాలు కరోనా వైరస్ నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే ఆలయంలోకి ప్రవేశం అనుమతిస్తున్నట్లు కొన్ని షరతులు విధించారు ఆ ఆలయ కమిటీ సభ్యులు.
ఈ తరుణంలో ఇటీవలే తెరుచుకున్న పూరి జగన్నాథ్ ఆలయ అధికారులు కూడా కొన్ని షరతులను పాటిస్తూ దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తున్నారు. ఈ రూల్స్ ను దేవుడి దర్శనార్థం కోసం వచ్చిన ప్రజలు ఖచ్చితంగా పాటించే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అయితే తాజాగా పూరి జగన్నాథ్ దేవుడి దర్శనం కోసం వచ్చిన ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ గణేష్ లాల్ కు చేదు అనుభవం ఎదురయింది.జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ కరోనా నెగిటివ్ రిపోర్ట్ అందజేయని కారణంగా గుడిలోపలకు ప్రవేశం లేకుండా తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గవర్నర్ సింహం ద్వారా నుంచే స్వామి వారిని దర్శించుకొని తిరిగి రాజ్ భవన్ కు వెళ్లినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.
దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఖచ్చితంగా కరోనా వైరస్ నెగటివ్ రిపోర్ట్ సమర్పించాల్సిందే అంటూ అధికారులు షరతు పెట్టుకున్నారు.ఇక నెగటివ్ రిపోర్టర్ లేదని గవర్నర్ ను ఎవరైనా అడ్డుకున్నారు అని ప్రశ్నించగా.అధికారులు అలాంటివేమీ లేదని.
గవర్నర్ నిబంధనలు పాటిస్తూ, గౌరవిస్తూ వారంతట వారే తిరిగి వెళ్లిపోయారని అధికారులు తెలియజేశారు.ఇక మరోవైపు అదే రోజున కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఆలయ అధికారులకు సమర్పించలేదన్న కారణంతో దాదాపు 3 వేల మంది భక్తులు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయారని అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యా శాఖ మంత్రి కూడా కరోనా నెగిటివ్ రిపోర్ట్ చేయని కారణంగా గుడిలోకి ప్రవేశం లేకుండా తిరిగి వెన్నకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.టెస్ట్ అనంతరం మంత్రి మళ్ళీ స్వామి వారిని దర్శించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.