టిక్ టాక్.ఈ పేరు తెలియని వారు ఉండరు.2019లో భారత్ లో బ్యాన్ అయినా చైనా యాప్స్ లో టిక్ టాక్ ఒకటి.దీని వల్ల ఎంతోమందికి మంచి జరిగితే మరెంతోమందికి అన్యాయం జరిగింది.
ఇక ఈ టిక్ టాక్ లో ఫెమస్ అయ్యేందుకు ఎంతోమంది ప్రాణాలు సైతం పోగుట్టుకున్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏమైతే ఏం లెండి.
ఇప్పుడు మన దేశంలో ఈ టిక్ టాక్ లేదు.సంతోషించాలి.
ఇకపోతే.ఇప్పుడు ఓ పన్నెండేళ్ల ఏళ్ళ బాలిక టిక్ టాక్ పైన కేసు వేసింది.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
ఇప్పటికే బైట్ డ్యాన్స్ కంపెనీ అంటే అదేనండి. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ ఎన్నో ఇబ్బందులు చూసింది.2020లో చెప్పలేనన్ని ఇప్పందులు పడింది.మన దేశంతో సహా ఎన్నో దేశాల్లో బ్యాన్ కూడా అయ్యింది.అలాంటి ఈ టిక్ టాక్ తాజాగా ఓ పన్నెండేళ్ల బాలిక బ్రిటన్‌లో టిక్‌టాక్‌పై కేసు వెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
వ్యక్తిగత గోప్యత విషయంలో ఐరోపా సమాఖ్య నిబంధనలను టిక్‌టాక్ ఉల్లంఘించిందని బాలిక కంప్లెయింట్.ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.ఇది నిజం.
ఆ అమ్మాయ్ కంప్లెయింట్ ను ఫైల్ చేసేందుకు స్థానిక కోర్టు సైతం అనుమతి ఇచ్చింది.ఇక ఇప్పుడు టిక్ టాక్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇంగ్లాండ్ పిల్లల కమిషనర్ అన్నే లాంగ్ఫీల్డ్ మద్దతు ఇస్తున్నారు.టిక్‌టాక్ యుకే, యూరోపియన్ యూనియన్ డేటా రక్షణ చట్టాలను ఉల్లగించింది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
డేటా రక్షణ లోపం కారణంగా తన వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయ్యిందని బాలిక ఇచ్చిన కంప్లెయింట్ ప్రకారం తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.పిల్లల డేటా రక్షణకు సంబందించిన కేసును 2019లో కూడా టిక్ టాక్ ఎదుర్కొంది.