యూకే: పన్ను ఎగవేత కేసులో భారతీయ వ్యాపారవేత్తపై నిషేధం

వేల కోట్లు సంపాదిస్తున్నా ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు సంబంధించిన డబ్బును పలువురు దొడ్డిదారిలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో కూడబెడుతున్నారు.మనదేశంలో ప్రభుత్వాలు మారినా, నల్ల ధనానికి మాత్రం చెక్ పడటం లేదు.

 Indian Origin In Uk Company Director Banned For Not Paying Income Tax, Swiss Ban-TeluguStop.com

అయితే పొట్ట చేత పట్టుకుని పరాయి దేశం వెళ్లినా కొందరు భారతీయుల్లో మాత్రం అక్రమ సంపాదన మీద మోజు తగ్గడం లేదు.తాజాగా బ్రిటన్‌లో స్థిరపడిన ఓ భారత సంతతి వ్యాపార వేత్త పన్ను ఎగవేత కేసులో ఆరేళ్ల నిషేధానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.బ్రిట‌న్‌లోని లిసెస్ట‌ర్‌ ఈస్ట్‌మిడ్‌ల్యాండ్ టౌన్‌లో మ‌హిళ‌ల దుస్తుల త‌యారీ కంపెనీకి డైరెక్ట‌ర్‌గా సురేందర్ సింగ్ వ్యవహరిస్తున్నారు.ఈయన ప‌న్ను ఎగవేత కేసులో దోషిగా తేలడంతో ఆరేండ్ల నిషేధం విధిస్తున్న‌ట్లు బ్రిట‌న్ ఇన్ సాల్వెన్సీ అధికారులు బుధ‌వారం ప్రకటించారు.సురేంద‌ర్ 2018 ఏప్రిల్ నుంచి 98 వేల ఫౌండ్ల టాక్స్ బిల్లు చెల్లించాల్సి వుందని తెలిపారు.

ప‌న్ను చెల్లించ‌డంలో విఫ‌ల‌మైనందుకు గాను ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా 2019 జూలైలో సురేందర్‌ను కంప‌ల్స‌రీ లిక్విడేష‌న్‌లో పెట్టారు.

Telugu Thousandpounds, Black, Surender Singh, Swiss Bank-Telugu NRI

అంతేకాకుండా సురేందర్ 2017 నవంబ‌ర్ నుంచి 2019 మార్చి వ‌ర‌కు 1.80 ల‌క్ష‌ల పౌండ్ల‌ను విత్ డ్రా చేసుకున్నాడు.కానీ అందుకు గల కార‌ణాలను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఇన్సాల్వెన్సీ స‌ర్వీస్ చీఫ్ ఇన్వెస్టిగేట‌ర్ రాబ‌ర్ట్ క్లార్క్ మాట్లాడుతూ.సురేందర్ స‌రైన రికార్డులు లేకుండా దాచి పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని తెలిపారు.త‌ద్వారా ప‌న్ను బ‌కాయిలు చెల్లించ‌కుండా అన‌వ‌స‌ర అడ్వాంటేజ్‌తో ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని రాబ‌ర్ట్ క్లార్క్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube