అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్న శ్రీను వైట్ల..?

నీకోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు శ్రీను వైట్ల.తొలి సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం, సొంతం, వెంకీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Can Srinu Vaitla Repeat Same Magic Without Kona Venkat, Srinu Vaitla, Manchu Vis-TeluguStop.com

ఢీ సినిమా నుంచి సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడిన శ్రీను వైట్ల రెడీ, కింగ్, దూకుడు, బాద్ షా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు.

అయితే బాద్ షా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి.

ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.దీంతో నిర్మాతలు సైతం శ్రీను వైట్లకు అవకాశాలు ఇవ్వడం లేదు.

శ్రీను వైట్ల వరుస విజయాలకు ఒక రకంగా అతనితో కలిసి పని చేసిన కోన వెంకట్, గోపీమోహన్ కూడా కారణం.

Telugu Gopi Mohan, Kona Venkat, Srinu Vaitla-Movie

వెంకీ సినిమా నుంచి వీళ్లు ముగ్గురూ కలిసి పని చేసి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు.అయితే బాద్ షా సినిమా సమయంలో విభేదాలు రావడంతో కోనవెంకట్, గోపీమోహన్ శ్రీనువైట్ల నుంచి విడిపోయారు.అప్పటినుంచే శ్రీను వైట్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించడం లేదు.

రామ్ చరణ్ కోరిక మేరకు బ్రూస్ లీ సినిమాకు కోన వెంకట్ శ్రీను వైట్లతో పని చేసినా ఆ సినిమా కూడా దారుణ పరాజయాన్నే చవిచూసింది.

ప్రస్తుతం శ్రీను వైట్లకు ఢీ సినిమా సీక్వెల్ డి అండ్ డి సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు గోపీ మోహన్ పని చేస్తుండగా కోన వెంకట్ పని చేయడం లేదని తెలుస్తోంది.అయితే సినీ విశ్లేషకులు శ్రీను వైట్ల కోనవెంకట్ కలిసి పని చేస్తేనే బాగుంటుందని.

శ్రీను వైట్ల కోన వెంకట్ సహకారం తీసుకోకపోతే మళ్లీ మళ్లీ తప్పు చేస్తున్నట్టు అవుతుందని చెబుతున్నారు.మరోవైపు కోన వెంకట్ కు కూడా సరైన సక్సెస్ లు లేకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube