కార్తీకమాసం మొదలవడంతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకుని స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటారు ఏదైనా శుభకార్యాలకు, గృహప్రవేశలకు ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.ఈ మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కొన్ని దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఏ రోజున ఎటువంటి వస్తువులు ధానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కార్తీక మాసం మొదటి రోజు: నెయ్యి, బంగారాన్ని దానం చేయాలి.
*రెండవ రోజు: కలువ పూలు, నూనె, ఉప్పు ఇతరులకు దానం చెయ్యాలి.
*మూడవరోజు: కార్తీక మాసం మూడో రోజు పార్వతి దేవిని పూజిస్తారు.ఈ రోజు ఉప్పును ఇతరులకు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
*నాలుగో రోజు: కార్తీక మాసంలో 4వ ఈ రోజైన చతుర్దశి రోజు నాగుల చవితి గా జరుపుకుంటారు.అలాగే వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
కార్తీక మాసం నాలుగవ రోజు పెసరపప్పును దానం చేయాలి.
*ఐదవ రోజు: కార్తీక మాసంలో వచ్చే 5వ రోజున జ్ఞాన పంచమి అని పిలుస్తారు.ఈరోజు ఆ ఆదిశేషుని పూజించి, పాలను దానం చేయాలి.
*ఆరవ రోజు: ఈ రోజున సంతానంలేనివారు ఎర్రటి కండువాను బ్రహ్మచారికి దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
*ఏడవ రోజు: కార్తీక మాసంలో 7వ రోజు దుర్గా దేవిని పూజించాలి.ఎర్రటి వస్త్రములో కొద్దిగా గోధుమలను మూటకట్టి ఇతరులకు దానం చేయడం ద్వారా ఆయుష్సు పెరుగుతుంది.
*ఎనిమిదవ రోజు: ఈరోజు గోపూజ నిర్వహించి, ఇతరులకు బియ్యాన్ని దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
*తొమ్మిదవ రోజు: కార్తీకమాసంలో ఈ రోజున ఆ విష్ణు భగవానుని పూజించి, ఎర్రటి కంది పప్పును దానం చేయాలి.
*పదవరోజు: కార్తీకమాసంలో పదవరోజు నూనెను, దానం చేయటం వల్ల ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
*పదకొండవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు శివుని ప్రత్యేకమైన పూజలతో పూజిస్తారు.ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
*పన్నెండవ రోజు: కార్తీక మాసంలోఈ రోజు ఉసిరి, తులసి చెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.ఈరోజు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది.
*పదమూడవ రోజు: కార్తీక మాసంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో వనభోజనాలకు వెళ్లి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇటువంటి రోజున బియ్యాన్ని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.
*పధ్నాలుగోవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు యమధర్మరాజును పూజించి దున్నపోతు లేదా గేదెను దానంగా ఇస్తారు.
*పదిహేనవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నదీస్నానమాచరించి, దీపాలు వెలిగించడం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి.
ఈరోజు సాయంత్రం నదిలో దీపాలను చంద్ర దర్శనం తర్వాత ముత్తయిదువులు ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.