యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్, జీవిత కూతురుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శివాత్మిక.రాజశేఖర్ కూతుళ్ళు శివానీ, శివాత్మిక ఇద్దరూ కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు.
అయితే పెద్ద కూతురు శివాని మొదటి సినిమా సగంలో ఆగిపోయింది.ఇప్పుడు డబ్యూడబ్యూడబ్యూ అనే టైటిల్ తో రెండో సినిమా చేసిన అది కూడా రిలీజ్ కాలేదు.
మూడో సినిమా తేజ సజ్జతో సోషియో ఫాంటసీ కథతో చేస్తున్న అది ఇంకా షూటింగ్ దశలో ఉంది.అయితే రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే దొరసాని అనే మూవీతో తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి తల్లి జీవితని గుర్తుచేసింది.
దీంతో వెంటనే ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి.దొరసాని సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురుగా శివాత్మిక నటిస్తుంది.

అలాగే అదితి అరుణ్ తో ఒక మూవీకి ఒకే చెప్పింది.మరో సినిమాకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది.అలాగే కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ ఒక సినిమా కంప్లీట్ చేసేసింది.ఆ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే తాను గ్లామర్ పాత్రలకి కూడా సిద్ధం అని చెప్పడానికి శివాత్మిక ఈ మధ్య కాస్తా హాట్ ఫోటో షూట్ లతో సందడి చేయడం మొదలు పెట్టింది.
తాజాగా ఆమె ఫోటోషూట్ కి సంబందించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు దర్శకులు తెలుగమ్మాయిలకి అంతగా ప్రాధాన్యత ఇవ్వరనే అభిప్రాయం ఉంది.మరి స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శివాని, శివాత్మిక ఎంత వరకు టాలీవుడ్ స్టార్ ఇమేజ్ ని అందుకుంటారు అనేది చూడాలి.