శోభనా చంద్రకుమార్ పిల్లై. ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టరేమో కానీ శోభన( Shobana ) అంటే మాత్రం అందరికి బాగా తెలిసిన నటి అని ఇట్టే గుర్తు పట్టేస్తారు.54 ఏళ్ళ వయసులో కూడా ఎంతో అందంగా, అద్భుతంగా నర్తిస్తూ, నటిస్తున్న ఈ నటి ఏకంగా 200 సినిమాల్లో నటించింది.సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మాత్రమే కాకుండా హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా ఆమె నటించింది.
మొదట మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా 1984లో నటిగా ఎంట్రీ ఇచ్చింది శోభన.చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఉన్న శోభన ఎంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది అంటే కెరియర్ అత్యంత పిక్ లో ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇకపై టాలీవుడ్ చిత్రాల్లో( Tollywood Movies ) నటించే ప్రసక్తే లేదు అంటూ ప్రకటన చేసింది.
ఏకంగా ప్రతి ఏటా ఆరు సినిమాలకి తగ్గకుండా చేస్తున్నఆ టైంలో అంత బిజీగా ఉండి కూడా తెలుగు చిత్రాలకు ఎందుకు స్వస్తి పలికింది అనేది చాలామందికి అప్పట్లో అర్థం కాలేదు.అయితే దాని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.

ఆమె 2006లో చివరగా గేమ్( Game Movie ) అనే ఒక సినిమాలో నటించింది.ఆ తర్వాత 2020 వరకు కేవలం 5 చిత్రాల్లో మాత్రమే ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో నటించాల్సి వచ్చింది.ఆల్మోస్ట్ ఆమె సినీ రంగానికి దూరం అయిపోయింది.కేవలం క్లాసికల్ డాన్స్( Classical Dance ) పర్ఫామెన్స్ మాత్రమే ఇస్తూ నటనకు స్వస్తి పలికింది.అయితే ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనక కొంత మంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.ఆమెను ఎంతోకొంత ఇబ్బంది పెట్టడం తోనే శోభన ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
దాంతో పటు ఆమె మలయాళ టాప్ హీరోతో ప్రేమాయణం సాగించి అతనితోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది.అయితే అతడు ఆమెకు బ్రేకప్ చెప్పడంతో ఎంతో డిప్రెషన్ కి లోనైనా శోభన ఇకపై పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చి కేవలం భరత నాట్యం మాత్రమే తన జీవితం అన్నట్టుగా బ్రతుకుతుంది.

ఆమె నటన విషయంలో మాత్రం చాలా మంచి చిత్రాలు నటించింది.ఉదాహరణకు కన్నడ సినిమాలో నటించిన ఆప్తమిత్ర( Apthamitra ) అనే చిత్రం ఎంతో పెద్ద ఘనవిజయం సాధించడంతో దానిని చంద్రముఖి పేరుతో రీమేక్ చేశారు.ఇక ఈ సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయిందో మనందరికి తెలిసిందే.అలాగే ఆమె ఉత్తమ నటిగా ‘మణిచిత్రతాళు’ అనే మలయాళ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకుంది.
ఇంగ్లీషులో మిత్ర్ మై ఫ్రెండ్ అనే సినిమాలో కూడా రేవతి దర్శకత్వంలో నటించింది.దీనికి కూడా మరొక జాతీయ అవార్డు లభించింది.ఇక ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు ఆమె సాధించగా పద్మశ్రీ, కలైమామణి అవార్డులు వాటితో పాటు గౌరవ డాక్టరేట్ కూడా అందుకుంది.