ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ లో భాగంగా శుక్రవారం షార్జా వేదిక గా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేయడం , అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల ఆల్ రౌండర్ ప్రతిభతో రాజస్ధాన్ జట్టుపై 46 పరుగులతో తేడాతో ఘన విజయం అందుకుంది.185 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఏ దిశలోనూ లక్ష్య చేధన వైపు సాగలేదు.ఢిల్లీ బౌలర్ల దాటికి రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తడబడింది.ఆర్ ఆర్ కేవలం 138 పరుగులకు కుప్పకూలింది.
యశ్వంత్ జైస్వాల్ (34, 36 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్) రాహుల్ తెవాటియా(38 , 29బంతుల్లో 2 సిక్స్‌లు,3 ఫోర్లు మాత్రమే ఆర్ ఆర్ తరపున చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.గత మ్యాచ్‌లో హిట్టింగ్ ఆడిన జాస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
ఇక కెప్టెన్ స్మిత్ (24),సంజూ శాంసన్(5) కూడా స్వల్ఫ స్కోర్‌కే మరోసారి ఔటయ్యారు.టాపార్డర్ చేతులెత్తేయడంతో రాజస్థాన్ టార్గెట్‌ను చేధించలేక బారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్.ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఆరంభంలో ఢిల్లీ తడబడింది.ఓపెనర్స్ పృథ్వీ షా(19), శిఖర్ ధావన్(5) మంచి అరంభాన్ని ఇవ్వలేదు.
ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22; 18 బంతుల్లో 4 ఫోర్లు) కూడా స్వల్ఫ పరుగులకే ఔటయ్యాడు.దీంతో ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దాటిగా ఆడతాడు అనుకున్న రిషభ్ పంత్(5) రనౌట్ కాగా , దీంతో కష్టాల్లో పడిన ఢిల్లీని మార్కస్ స్టోయినిస్ ), షిమ్రాన్ హెట్‌మైర్ ఆదుకున్నారు.దీనితో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.