దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా మనషుల మధ్య దూరం పాటించాల్సి వస్తుంది.
అంతేకాక ఎక్కడికి వెళ్లిన మాస్కులు ధరించక తప్పడం లేదు.అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో శుభకార్యాలు జరిపించాలంటే ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాల్సిందే.
అయితే ఒక్కప్పుడు పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకునేవారు.కానీ ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లిళ్లు సింపుల్‌గా జరిపిస్తున్నారు.
ఎంత గొప్పవారి పెళ్లికి అయినా అతిధులు కరువవుతున్నారు.కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓ కోతి విషిష్ట అతిథై వధూవరులను ఆశీర్వదించింది.
ఇక తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది వానరం.ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారు.వారు మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓ వివాహ నిడారంబరంగా జరిపిస్తున్నారు.అప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా షాక్ కి గురి చేసే సంఘటన చోటు చేసుకుంది.
ఈ వేడుకలో వానరం పాల్గొని వధూవరులను ఆశీర్వదించింది.ఈ అద్భుత సంఘటనతో బంధువుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం ఉరకలేసింది.