కరోనా ప్రభావం సౌత్ ఇండియా రాష్ట్రాలలో చాలా ప్రమాదకర స్థితిలో ఉంది.ముఖ్యంగా తమిళనాడులో కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది.
ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కరోనా సడలింపులు పూర్తిగా ఇచ్చిన థియేటర్లు ఓపెన్ చేయలేని పరిస్థితి.థియేటర్లు ఓపెన్ చేసిన ఒకప్పటిలా ప్రేక్షకులు సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్తారా అనేది కూడా సందేహమే.
ఇలాంటి పరిస్థితిలో ఇప్పటికే పూర్తయిన సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాలేని స్థితిలో ఉన్నాయి.అయితే కొంత మంది తెగించి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ లో థియేటర్ అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టిన దర్శక, నిర్మాతలు అందరూ ఓటీటీకి అలవాటు పడిపోయారు.అయితే తెలుగు స్టార్స్ మాత్రం ఇంకా థియేటర్ లోనే సినిమాలని రిలీజ్ చేస్తామని వేచి చూస్తున్నారు.
అయితే థియేటర్లు ఓపెన్ చేయడానికి కేంద్రం ఆమోదం తెలపలేదు.దీంతో వీరంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.
అయితే ఈ సమయంలో మరో ఆప్షన్ లేదని ఫిక్స్ అయినా వారు ఓటీటీకి వెళ్లిపోతున్నారు.తెలుగులో నాని, అనుష్క సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఇక తమిళంలో సూర్య సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.ఇదిలా ఉంటే సౌత్ లో రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్న పెద్ద సినిమాలపై ఇప్పుడు ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.
ఆ సినిమాలని తమ ఓటీటీలో రిలీజ్ చేస్తే సబ్ స్క్రయిబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది.దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న స్టార్ హీరో విజయ్ సినిమా కోసం ఓటీటీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని కొనేందుకు పోటీ పడుతున్నాయి.ఒక ఓటీటీ సంస్థ 70 కోట్లు ఆఫర్ చేయగా, మరో సంస్థ 100 కోట్ల దాకా ఆఫర్ ప్రకటించింది.
అయితే వంద కోట్లు కంటే బెస్ట్ ఆఫర్ వస్తే ఓటీటీలో రిలీజ్ చేయాలని, లేదంటే లేచి చూడాలని మాస్టర్ మూవీ నిర్మాత భావిస్తున్నారు.