కరోనా వారియర్స్‌కు యూకే సెల్యూట్: భారత సంతతి వైద్యుడికి అరుదైన పురస్కారం

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిది.ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారు చికిత్స అందిస్తున్నారు.

 Indian-origin Physician Ravi Solanki Wins Award For Covid-19 Work In Uk, Ravi S-TeluguStop.com

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైద్యులు కోవిడ్ బారినపడి మరణించగా.మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

డాక్టర్ల సేవలను గుర్తిస్తూ వివిధ దేశాలు వారిని తమదైన శైలిలో సత్కరిస్తున్నాయి.

తాజాగా భారత సంతతికి చెందిన వైద్యుడికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం లభించింది.

కోవిడ్ సంక్షోభ కాలంలో చేసిన సేవలకు గాను నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక అవార్డు లభించింది.కరోనా రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సోలంకి చేసిన సేవలకు ఈ పురస్కారం లభించింది.

Telugu Britain, Corona Warriors, Covid, Indianorigin, Ravi Solanki-

దీనితో పాటు మెషిన్ లెర్నింగ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రేమండ్ సీమ్స్‌తో కలిసి స్వచ్ఛంద సంస్థ హీరోస్ కోసం ఓ వెబ్‌సైట్‌ను తయారు చేసి ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్‌సైట్ తయారు చేసి పిల్లల సంరక్షణ, కరోనా సేవలో ఉన్న వారికి సోలంకి పీపీఈ కిట్లు అందించారు.ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజల నుంచి సందేహాలు , సలహాలతో పాటు విరాళాలను కూడా స్వీకరించారు.ఈ వెబ్‌సైట్ మూడు నెలల్లో 90 వేల మంది ఎన్‌హెచ్‌ఎస్ కార్మికులకు మద్ధతుగా నిలిచింది.

రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube