పాదాల వాపులు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చెక్ పెట్టండి!

గర్భాధారణ సమయంలో పాదాల వాపులు స‌హ‌జ‌మే.కానీ, సామాన్యుల‌ను కూడా పాదాల వాపుల స‌మ‌స్య వేధిస్తుంటుంది.

 Simple Home Remedies For Swollen Feet Legs! Swollen Feet Legs, Swollen, Legs, H-TeluguStop.com

పాదాల వాపు స‌మ‌స్య‌ను ఎడీమా అని కూడా అంటారు.వాస్త‌వానికి రోజంతా కూర్చుని ప‌ని చేసినా లేదా రోజంతా నిల‌బ‌డి ప‌ని చేసినా.

పాదాలు వాపులు వ‌స్తుంటాయి.ఈ స‌మ‌స్య చిన్న‌గా క‌నిపించినా.

చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది.

దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఈ పాదాల వాపులు భ‌విష్య‌త్తులో గుండె స‌మ‌స్య‌ల‌కు కూడా దారితీయ‌వ‌చ్చు.అందుకే ఈ స‌మ‌స్య ఆదిలోనే నివారించుకోవాలి.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే పాదాల వాపు వ‌స్తుంది.

అయితే రోజులో కూర్చోవ‌డం, నిల‌బ‌డ‌డం రెండు స‌మానంగా ఉండాలి.

Telugu Tips, Latest, Legs, Swollen-

రోజంతా కూర్చుని ప‌ని చేసేవారు.అప్పుడ‌ప్పుడూ అటు ఇటు కాసేపు న‌డుస్తూ ఉండాలి.అలాగే రోజంతా నిల‌బ‌డి ప‌ని చేసేవారు.

కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వాలి.అప్పుడే రక్త ప్రసరణ‌‌‌‌ బాగా జ‌రిగి పాదాల వాపులు త‌గ్గుతాయి.

ఎందుకంటే.ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే పాదాల వాపు వ‌స్తుంది.

ఇక వాతావ‌ర‌ణం ఎంత చ‌ల్ల‌గా ఉన్నా.వేడిగా ఉన్నా నీరు తాగ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

నీరు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా పాదాల వాపు త‌గ్గించుకోవ‌చ్చు.అలాగే పాదాల వాపును త‌గ్గించ‌డంలో పుదీనా ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

పాదాల వాపు ఉన్న‌ప్పుడు పుదీనా ఆయిల్ రాసి మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటేనే పాదాల వాపులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

క్యారట్, బీట్‌రూట్, ఆకుకూరలు, మునగకాడలు, దానిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube