దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా కారణంగా మొత్తం పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి.అన్ని రంగాలు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి నెలకొని ఉంది.
వ్యవస్థలు కూడా దారుణంగా కుప్పకూలిపోయాయి.మళ్ళీ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది.
ఇలాంటి సమయంలో ప్రజలకి ప్రధాన ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా, క్రికెట్ వ్యాపారం కరోనా దెబ్బ గట్టిగా పడింది.ఇప్పటికే మొదలు కావాల్సిన దేశీయ క్రికెట్ పండగ ఐపీఎల్ వాయిదా పడింది.
ఇక దుబాయ్ లో ఐపీఎల్ సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతుంది.అది కూడా చాలా తక్కువ ప్రేక్షకులకి పరిమితం చేస్తుంది.
ఇక వచ్చే ఏడాది జరగాల్సిన మరో క్రికెట్ పండగ వరల్డ్ 20-20 ప్రపంచ కప్ పై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.
ముందుగా నిర్దేశించిన ప్రకారం 2021లో జరగాల్సిన పురుషుల టి-20 ప్రపంచకప్ భారత్ లోనే జరుగుతుందని పేర్కొంది.
అయితే, ఈ ఏడాది ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టి-20 పురుషుల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే 2022లో జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వివరించింది.
మొత్తానికి క్రికెట్ పండగని ఆశ్వాదించాలని అనుకునే క్రికెట్ ప్రేమికులు అందరికి ఐసీసీ చెప్పిన శుభవార్త నిజంగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంది.అయితే అప్పటికి కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదానిపై మళ్ళీ వరల్డ్ కప్ కి ముందు నిర్ణయం మార్చుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఈ ఏడాది కరోనా కారణంగా చాలా ద్వైపాక్షిక సిరీస్ లు రద్దైపోయిన సంగతి తెలిసిందే.
.