వివాదాస్పద సినిమాలు తీస్తూ అందరిని రెచ్చగొడుతూ ఆ గొడవలతో సినిమాలని మార్కెట్ చేసుకొని డబ్బులు చేసుకునే దర్శకుడు ఆర్జీవీ.ఒక్కప్పుడు గొప్ప దర్శకుడు అయిన ఇప్పుడు మాత్రం అందరితో చెత్త దర్శకుడు అనిపించుకుంటున్న ఆర్జీవీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోకి దూరిపోయి పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్జీవీ మీద చాలా కోపంగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ లో ఉండటంతో అతనిని వ్యతిరేకించే వారు సినిమాని సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆర్జీవీని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అతని మీద సినిమాలు ఎనౌన్స్ చేశారు.వాటికి సంబందించిన ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.
వీటి తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ మీడియాలో వాఖ్యలు చేశారు.తన ఆఫీస్ అడ్రెస్ చెప్పి ఎవరైనా దమ్ముంటే రావాలని సవాల్ చేశారు.
దీంతో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవీ ఆఫీస్ కి వెళ్ళారు.అక్కడ అతను లేకపోవడంతో ఆఫీస్ కొంతసేపు గందరగోళం నెలకొంది.పవన్ కళ్యాణ్ అభిమానులు తన ఆఫీస్ పై దాడి చేసినట్లు ఆర్జీవీ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఆర్జీవీని అడగడానికి వెళ్ళిన తమపైనే వారి మనుషులు ఎదురుదాడి చేశారని, ఓయూ జేఏసీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆర్జీవీ మీద కేసు పెట్టారు.అయితే ఈ ఘటనపై మరింత రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్ పై దాడి చేయడానికి వచ్చి సినిమాకి మరింత ప్రచారం కల్పించారని, వారికి ముద్దు పెట్టాలని ఉంది అంటూ వెటకారంగా పోస్ట్ చేశాడు.మరోవైపు సినిమాని రేపు రిలీజ్ చేయబోతున్నాడు.
దీనిపై ఎంత వరకు రచ్చ అవుతుంది అనేది చూడాలి.