టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన 30 ఇయర్స్ పృధ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ లో ఒకడిగా పృధ్వీ ఉన్నాడు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దయతో టీటీడీ భక్తి చానల్ చైర్మన్ పదవిలో కూర్చున్నాడు.అయితే అనూహ్యంగా కొన్ని నెలల క్రితం క్రింది స్థాయి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులు బయట పడటంతో అతనిని చైర్మన్ పదవి నుంచి తొలగించారు.
ఆ పదవిని ఇప్పుడు దర్శకుడు శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఆ ఘటన తర్వాత పృధ్వీ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైపోయింది.
ముఖ్యంగా కామెడీ షోలలో కూడా ఆ ఆడియోటేపులని లక్ష్యంగా చేసుకొని స్కిట్ లు వేసి హేళన చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో టిక్ టాక్ యాప్ లో ఆ ఆడియో టేపులని మీమ్స్ గా మార్చి ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ టిక్ టాక్ వీడియోలు చాలా మంది చేస్తూ ఉండటంతో పృద్వీ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించాడు.తన వీడియోలను కొందరు ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తనను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా టిక్‌టాక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో తన వీడియోలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.