టక్ జగదీష్ కోసం బిగ్‌బీని ఫాలో అవుతున్న నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన మార్క్ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని.

 Nani, Tuck Jagadish, V Movie, French Cut, Telugu Movie News-TeluguStop.com

అయితే ఈ సినిమాలో తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న నాని, తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు.

టక్ జగదీష్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో నాని ఫ్రెంచ్ కట్ గడ్డంతో మనకు కనిపిస్తాడట.

ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.నానితో పాటు ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా నటిస్తాడని తెలుస్తోంది.

ఫ్రెంచ్ కట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిగ్ బీ అమితాబ్ బచ్చన్.

దీంతో ఇప్పుడు నాని బిగ్ బి బాటలో పయనిస్తున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ లుక్‌లో నాని ఎలా కనిపిస్తాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube