జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ టాలీవుడ్ లోకి తాజాగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే లాయర్ సాహెబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం హిందీలో మంచి విజయాన్ని సాధించినటువంటి చిత్రానికి రీమేక్ గా ఉంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కూడా మరో చిత్రాన్ని చేస్తున్నాడు.
ఈ చిత్రం ఈ రోజున కొంతమంది సినీ ప్రముఖుల మధ్యన లాంఛనంగా ప్రారంభం కానుంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపకుండా చాలా సైలెంట్ గా చిత్ర పనులు సాగుతున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని 25 రోజుల్లోపు పూర్తిచేయాలని దర్శకుడు క్రిష్ కి కండిషన్ కొద పెట్టినట్లు సమాచారం.అందువల్లనే దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఫాస్ట్ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ చిత్ర కథని గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ గా మరి పేద ప్రజలకు ఎలా సహాయం చేశాడు మరియు అవినీతి రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని సుభిక్షం వైపు ఎలా నడిపించాడు అనే అంశంతో ఈ చిత్రం పోతున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం మరియు వరుస సినిమాలు చేస్తుండటంతో పవన్ అభిమానులు ఖుషి చేసుకుంటున్నారు.