ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్ బాధితులకు కడుపు నింపుతున్న భారతీయ జంట

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్ ధాటికి అక్కడి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించగా… లక్షలాది మంది సొంత ఊళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

 Indian Sikh Couple Providing Free Meals To Victims Of Australia Bushfires-TeluguStop.com

వారిని ఆదుకోవడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి.ఇదే సమయంలో ఒక భారతీయ జంట బుష్‌ఫైర్ బాధితులకు తమ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

Telugu Indian Sikh, Indiansikh, Kamal Jith Kawr, Victoriabaiern-

కమల్‌జిత్ కౌర్, ఆమె భర్త కన్వాల్‌జిత్ సింగ్ గత ఐదు రోజులుగా విక్టోరియాలోని బెయిర్న్ స్టేల్‌లోని తమ దేశి గ్రిల్ రెస్టారెంట్‌లో బాధితులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా కమల్ కౌర్ మాట్లాడుతూ.తాము భోజనాన్ని పునరావాస కేంద్రాలకు పంపిణీ చేస్తున్నామని.అలాగే తమ రెస్టారెంట్‌కు వచ్చే వారికి సైతం సాయం చేస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం దేశంలో పరిస్ధితి చాలా ఘోరంగా ఉందని.ఈ ప్రాంతంలో తక్కువ స్థాయిలోనే మంటలు, మెల్లమెల్లగా విస్తరించిందని ఆమె వెల్లడించారు.

ప్రజలు ప్రాణాలు, ఇళ్లు, పొలాలు, జంతువులను కోల్పోయారని కమల్‌జిత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Indian Sikh, Indiansikh, Kamal Jith Kawr, Victoriabaiern-

భారతదేశానికి చెందిన ఈ జంట పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది.కమల్‌‌జిత్ కౌర్ తన భర్తతో కలిసి 2016లో బైర్న్స్‌డేల్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.బుష్‌ఫైర్ కారణంగా చాలా మంది సిబ్బంది ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని.

కానీ తన కుటుంబం, స్నేహితులు రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని ఆమె వెల్లడించారు.కాగా ఈ ఘోర విపత్తులో విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, దక్షిణ ఆస్ట్రేలియా ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

విక్టోరియన్ ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ గురువారం ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube