బ్రిటన్ లేబర్ పార్టీ అధ్యక్ష రేసులో భారత సంతతి ఎంపీ

భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లిసా నంది, లేబర్ పార్టీ చీఫ్ పదవిపై అఫిషీయల్‌గా గురిపెట్టారు.డిసెంబర్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గడచిన 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో తాను తిరిగి పూర్వవైభవం కోసం కృషి చేస్తానని లీసా శపథం చేశారు.

 Indian Origin Lisa Nandy Announces Bid For Labour Pary Leadership To Replace Je-TeluguStop.com

ఈ పదవి కోసం ఆమెతో పాటు బర్మింగ్‌హామ్ ఎంపీ జెస్ ఫిలిప్స్, షాడో మొదటి విదేశాంగ కార్యదర్శి ఎమిలి థోర్న్ బెర్రీ, షాడో సస్టైనబుల్ ఎకనామిక్స్ మంత్రి క్లైవ్ లూయిస్‌ పోటీ పడుతున్నారు.

ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో లిసా ఇలా అన్నారు.

‘‘భవిష్యత్‌లో ఏర్పడబోయే లేబర్ ప్రభుత్వం దేశంలోని ప్రతి పట్టణం, నగరం, ప్రాంతానికి శక్తిని, వనరులను ఇస్తుంది.గతంలో ఉన్న పితృస్వామ్యాన్ని విడిచిపెట్టి, తమకు తాముగా మార్పును అందించే సామర్ధ్యాన్ని ప్రజలకు ఇవ్వాలి.

రాడికల్, డైనమిక్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి తాను ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఓడించాలని నిశ్చయించుకున్నానని, అందుకు తనలో మీరు కోరుకున్న అర్హత వుందని నమ్ముతున్నా’’.

Telugu Britanmp, Indianorigin, December-

ప్రస్తుత లేబర్ పార్టీ అధినేత జెరెమీ కార్బిన్ స్థానంలో ఫిలిప్స్ తన బిడ్‌ను ప్రకటించిన కొద్దిగంటలకే నంది తాను కూడా రేసులో ఉన్నానని చెప్పడం కొసమెరుపు.లేబర్ పార్టీ కొత్త అధ్యక్షుడికి సంబంధించి ఎన్నికల నిర్వహణ, ఇతర నిబంధనలను జనవరి 6న పార్టీ పాలక జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) నిర్ణయించనుంది.డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది.

ఈ ఘోర పరాజయంతో ప్రతిపక్షనేత, లేబర్ పార్టీ అధినేత జెరెమి కార్బిన్ తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube