ఉల్లి కోసం వెరైటీ నిరసన తెలిపిన ఎమ్మెల్యే

దేశంలో ఉల్లి ధరలకు పలు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు.ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజలు ఉల్లి కొనకుండానే కన్నీళ్లు పెడుతున్నారు.కొన్ని రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.80 కూడా దాటడంతో మధ్యతరగతి మాట పక్కనపెట్టి ఉన్నవాళ్లు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది.దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉల్లిని సబ్సీడీ కింద అందిస్తున్నారు.

 Rjd Mla Shivchandra Ram Onion Price Hike-TeluguStop.com

బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉల్లి ధరను కట్టడి చేయలేకపోవడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ వెరైటీ నిరసన తెలిపారు.

విధాన సభ ఎదుట ఆయన మెడలో ఉల్లి దండ వేసుకుని ఉల్లి ధరను అదుపుచేయాలని నిరసన తెలిపారు.శీతాకాల సమావేశాల సందర్భంగా ఆయన ఈ విధంగా నిరసన తెలిపారు.

సామానుల్యకు ఉల్లి ధరను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేపట్టాలని ఆయన కోరారు.

ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి ధర మండుతోంది.

మరి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా సామానుల్య కోసం ఉల్లి దండతో నిరసన తెలిపిన ఎమ్మల్యేను పలువురు అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube