ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఏ స్త్రీ కి కూడా రక్షణ లేదు అని నొక్కి చెప్పే పరిస్థితి ఏర్పడింది.
అయితే కేవలం బతికున్న స్త్రీలకే కాదు చనిపోయి శవమై స్త్రీ కి కూడా భద్రత లేదు అన్న విషయం గురించి వింటే మాత్రం మీరు నోరెళ్లబెట్టాల్సిందే.ఇలాంటి అత్యంత దారుణ ఘటన ఒకటి పొరుగుదేశం పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.
అనారోగ్యం తో మృతి చెందిన ఒక మహిళ శవాన్ని వేలికి తీసి అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది.
నిజంగా ఇంతకంటే దారుణం ఎక్కడా లేదని చెప్పాలి.ఒక చనిపోయిన మహిళ శవాన్ని పూడ్చిపెట్టిన స్థలం లో నుంచి బయటకు తీసి మరి ఇలా అత్యాచారం కి పాల్పడడం అక్కడ తీవ్ర కలకలం సృష్టిస్తుంది.వివరాల్లోకి వెళితే… లోథీ పట్టణానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోవడంతో శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు.
అయితే ఆదివారం తిరిగి ప్రార్థనలు చేసేందుకు ఆమె సమాధి వద్దకు వెళ్లి చూసిన బంధువులు,కుటుంబసభ్యులు అక్కడ పరిస్థితి ని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.ఆమెను ఖననం చేసిన చోట మట్టి తవ్వేసి ఉండటం, మృతదేహం బయటపడి ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
అనంతరం ఆ మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు వారు నిర్ధారించుకుని కాటికాపరిని నిలదీయగా అతడు నీళ్లు నమిలాడు.
ఆ తరువాత కుక్క ఆ మట్టిని తవ్వింది అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు.
అయితే దీనితో అనుమానం వచ్చిన మృతురాలి కుటుంబసభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇది తెలిసిన వారి పనేనని వారు ఫిర్యాదులో పేర్కొనడాం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరోవైపు కాటికాపరి పరారీలో ఉండటంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అతడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.
కాటికాపరి గనుక దొరికితే అసలు విషయం బయటపడొచ్చు అని అటు మృతురాలి బంధువులు,పోలీసులు భావిస్తున్నారు.ఇలా చనిపోయిన మహిళ పై కూడా అత్యాచారం కి పాల్పడడం తో ఇక మామూలుగా బతికి ఉన్న మహిళలకు రక్షణ ఎక్కడనుంచి ఉంటుంది అని అక్కడి మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.