తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా అన్ని భాష పరిశ్రమల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది.కొత్త వారు, అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్స్, నటీమనులు కొన్ని సార్లు కోఆర్డినేటర్లు మరియు దర్శక నిర్మాతలకు తమను తాము అర్పించుకోవాల్సి ఉంటుంది.
అలా చేస్తేనే అవకాశాలు వస్తాయి.ఇండస్ట్రీలో ఎంతో మంది అలా అవకాశాలు దక్కించుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కోరిక మరియు తపనతో పలువురు అలాంటి పని చేయడం జరిగింది.ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్‌గా వెలుగు వెలుగుతున్న వారు, ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న వారు కూడా కాస్టింగ్ కౌచ్‌కు బలి అయిన వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమాల్లో ఆఫర్ల కోసమే కాస్టింగ్ కౌచ్‌కు ఎంతో మంది బలి అవుతున్నారు.అయితే కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ బారిన పడకుండా స్టార్స్ అవుతున్నారు.అందులో తాను ఒక హీరోయిన్‌ను అంటూ సమంత చెప్పుకొచ్చింది.తాజాగా ‘మహానటి’ చిత్రంలో నటించిన సమంత మీడియాతో మాట్లాడిన సందర్బంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం జరిగింది.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని తాను చెప్పను అని, కాని తాను మాత్రం కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని కాదు అంటూ చెప్పుకొచ్చింది.తాను నటించిన మొదటి సినిమా విజయాన్ని దక్కించుకున్న కారణంగా రెండవ ఆఫర్ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం దక్కింది.
దాంతో తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదని, అవకాశా కోసం వెదుకునే అవసరం రాలేదని చెప్పుకొచ్చింది.
ఎప్పుడైతే ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారో అప్పుడే కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఏర్పడటం జరుగుతుందని ఈ సందర్బంగా సమంత చెప్పుకొచ్చింది.
సినిమాల్లో ఆఫర్ల కోసం వెంపర్లాడటం వల్ల కూడా ఎదుటి వారు అవసరాన్ని వారికి అనుగుణంగా మార్చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తారంటూ సమంత పేర్కొంది.గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి భారీ ఎత్తున వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే.
కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది.
ఎన్ని కమిటీలు వేసినా, ఎంతగా ప్రయత్నించినా కూడా కాస్టింగ్ కౌచ్‌ను తగ్గించడం, రూపు మాపడం అనేది జరగని పని అని, అవసరం కోసం ఆడవారు స్వయంగా తమను తాము అర్పించుకునేందుకు సిద్దం అవుతారు అని, కొందరు ఓపికతో సినిమాల్లో ప్రయత్నించకుండా, అడ్డ దారిలో సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు.
అలాంటి వారు ఉన్నంత కాలం కాస్టింగ్ కౌచ్ అనేది తప్పదని ఈ సందర్బంగా కొందరు అంటున్నారు.సమంత కొద్ది మంది మాత్రమే కాస్టింగ్ కౌచ్‌ను దాటుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చారు.
భవిష్యత్తులో ఇంకెంత మంది కాస్టింగ్ కౌచ్‌కు బలి అవుతారో చూడాలి.