సాధారణంగా ప్రతి ఒక్కరు ఎదో ఒక చర్మ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ చర్మ సమస్యల్లో ముఖ్యంగా నల్ల మచ్చలు, మొటిమలు,చర్మం పొడిబారటం వంటివి ఉంటాయి.
ఈ చర్మ సమస్యల నుండి బయట పడాలంటే తేనే,నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది.ఇప్పడు తేనే,నిమ్మరసం ఉపయోగించి ఏ చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చో చూద్దాం.
రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి రాత్రి పడుకొనే ముందు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
తేనే,నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మంపై మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనపడుతుంది.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ ఓట్ మీల్ పొడిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే నల్లని మచ్చలు తొలగిపోతాయి.
ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.
ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.