చక్కని సామజిక అంశంతో తీసిన ‘శ్రీమంతుడు’ సినిమా మహేష్ స్థాయిని అమాంతం పెంచేసింది.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకొని నిరాశ పరిచింది.ప్రస్తుతం మహేష్ మురుగుదాస్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు.
‘ శ్రీమంతుడు’ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించిన దర్శకుడు కొరటాల శివనే మళ్ళీ నమ్ముకున్నాడు మహేష్.ఎందుకంటే ప్లాప్స్ లో ఉన్న సమయంలో కొరటాల చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా మహేష్ కి మంచి జోష్ ఇవ్వటమే కాకుండా నిర్మాతగా మారిన మహేష్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫిబ్రవరికి పూర్తి అయ్యిపోతుందట.
అప్పటికి పూర్తి కథను రెడీ చేయాలనీ కొరటాలకు డెడ్ లైన్ విధించాడట ప్రిన్స్.మంచి హిట్ వచ్చేలా పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేయాలనీ కొరటాలకు చెప్పాడు మహేష్ బాబు.