దిల్ రాజు నిర్మాణం లో త్రివిక్రమ్ భారీ చిత్రం

అటు ప్రేమ కథలు ఇష్ట పడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్ట పడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధం గా కథలను రూపొందించుకుని , చక్కటి చిత్రాలను తీయటం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి.ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ‘అ.

 Trivikram – Dil Raju Big Budget Film Announced-TeluguStop.com

ఆ ‘ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.

ఇదే విషయాన్నీ ప్రస్థావిస్తూ , ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు త్రివిక్రమ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు.ఒక పెద్ద స్టార్ హీరో తో ఈ చిత్రం ఉంటుంది అని , ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు.

” త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాకు ‘నువ్వే కావాలి’ సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది.సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం.ఇప్పుడు మా బ్యానర్ లో ఆయన తో ఒక భారీ సినిమా తేయబోతున్నాం ” అని అన్నారు.

అ.ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, “జూన్ లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు.

అటువంటి ట్రెండ్ ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది.కేవలం ఒక వారం లో డిస్ట్రిబ్యూటర్ ల కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలం లో ఏ సినిమా కి జరగలేదు.

ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ కి , మా ప్రొడ్యూసర్ చినబాబు గారికి నా అభినందనలు” అని అన్నారు.

ఈ నూతన చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube