ప్రభుత్వ స్కూల్ కు రూ.6 కోట్ల కరెంటు బిల్లు.. చివరికి?

కరోనా లాక్ డౌన్ సమయంలో కరెంటు బిల్లుల మోత ఒక క్రమంలో జోరందుకుంది.కరెంటు వాడినంత కాకుండా దానికి మరింత రెట్లతో బిల్లులు రాగా వినియోగదారులు షాక్ తిన్నారు.

 6 Crore Current Bill For A Government School In Odisha, Government School, Elect-TeluguStop.com

అంతేకాకుండా మామూలు ఇళ్లల్లో కూడా లక్షలకుపైగా కరెంటు బిల్లు రావడం అందరినీ ఆందోళన పరిచింది.ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువగా రావడంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అదే తరహాలో ఇటీవలే ఓ ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన రూ.6 కోట్ల కరెంట్ బిల్లు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఒడిశాలోని కటక్ జిల్లా లో కంటపాడ సమితి శిశువా పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ కవితా రాణి సాహు.తన పాఠశాలకు వచ్చిన కరెంటు బిల్లు ని చూసి షాక్ కు గురైంది.

కవితా రాణి తెలిపిన ప్రకారం 2016లో తమ పాఠశాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని.అప్పటినుండి కరెంట్ బిల్లు ఒక్కసారి కూడా రాకపోగా గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం బిల్లు వచ్చిందని తెలిపింది.తీరా బిల్లు చూస్తే రూ.5,87,12,580.ఇది చూసిన ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదట.అంతేకాకుండా ఫిబ్రవరి 17 లోపు కరెంట్ బిల్లు చెల్లించకపోతే పెనాల్టీ రూ.5,92,82,212 లను చెల్లించాలని సూచించారట.

Telugu Cuttack, School, Odisha, Rupees Crore-Latest News - Telugu

ఈ విషయం గురించి ఉపాధ్యాయులంతా స్థానిక విద్యుత్ సరఫరా కార్యాలయ అధికారులకు తెలిపారు దీంతో అధికారులు సాంకేతిక లోపాలవల్ల విద్యుత్తు సరఫరాలో సమస్యలు ఎదురవుతుంటాయి.దీనివల్ల తప్పుడు బిల్లు వచ్చే అవకాశం ఉందని తిరిగి కొత్త బిల్లు పంపిస్తాం అంటూ టాటా పవర్ సెంట్రల్ ఒడిషా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.తిరిగి కొన్ని నెలల తర్వాత మళ్లీ అదే విధంగా రూ.‌ 6 కోట్లకు పైగా బిల్లు వచ్చింది.దీంతో మీడియా వాళ్లకు తెలపగా వాళ్లు విద్యుత్ అధికారులతో చర్చిస్తే వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

కాగా కవితా రాణి నేరుగా టీపీసీఓడీఎల్ అధికారులతో మాట్లాడగా వాళ్లు బిల్లు చెల్లించాలని లేదా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని అనగా.గోపాలపూర్ ఎస్డివో కు ఈ విషయాన్ని తెలిపింది.

దీంతో సాంకేతిక లోపం వల్ల తప్పు జరిగిందని దాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube