ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 ఓట్ల లెక్కింపు కేంద్రాలు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలను ప్రకటించింది.నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ,మునుగోడు,నకిరేకల్ నియోజకవర్గాల కౌంటింగ్ జిల్లా కేంద్రంలోనిదుప్పలపల్లి వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్ లో,సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్,కోదాడ, సూర్యాపేట,తుంగుతుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోడౌన్ లో,యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి,ఆలేరు నియోజకవర్గాల కౌంటింగ్ రాయిగిరిలోని ఆరోరా అకాడమీలో ఏర్పాటు చేయనుంది.

Latest Nalgonda News