పెళ్లి సందడి సినిమా తో రాఘవేంద్ర రావు తెలుగు ప్రేక్షకులకు శ్రీ లీల( Sri Leela ) ను పరిచయం చేశాడు.ఆ సినిమా నిరాశ పరిచినా కూడా శ్రీలీల జోరు మొదలైంది.
మొదటి సినిమా ఫ్లాప్ అయితే సాధారణంగా హీరోయిన్స్ మళ్లీ కనిపించరు.కానీ శ్రీలీల కు ధమాకా ఆఫర్ దక్కింది.
ఆ సినిమా హిట్ అవ్వడం తో ప్రస్తుతం ఆమె చేతి లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమా లు ఉన్నాయి.అందులో ఒకటి ఆదికేశవ.
మెగా హీరో వైష్ణవ్ తేజ్( Mega hero Vaishnav Tej ) హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఆదికేశవ సినిమా( Adikesava movie ) లో శ్రీలీల నటించింది.ఈ మధ్య కాలంలో ఈమె భగవంత్ కేసరి సినిమా తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది.బాలయ్య సినిమా హిట్ లో శ్రీ లీల పాత్ర కీలకం.ఆమె లక్ కలిసి వచ్చి బాలయ్య మూవీ హిట్ అయిందని అనే వారు చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు ఆదికేశవ సినిమా కు కూడా శ్రీ లీల లక్ కలిసి వచ్చి హిట్ పడుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల కాంబోలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటాయి అంటున్నారు.
ఈ సినిమా ను సితార ఎంటర్ టైన్‌మెంట్స్( Sitara Entertainments ) వారు నిర్మించారు.భారీ బడ్జెట్ తో వైష్ణవ్ తేజ్ కి ఒక మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా గా ఇది నిలుస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.అన్ని ఎలిమెంట్స్ కలిసి వస్తున్న కారణంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా తో శ్రీలీల మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.