అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
అటు మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.దీంతో పాటు టీడీపీ నేత కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరపనుంది.కాగా ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుతో పాటు సీఐడీ నమోదు చేసిన పలు కేసుల్లో బెయిల్ కోరుతూ చంద్రబాబు గతంలోనే పిటిషన్లు దాఖలు చేశారు.