మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న రాత్రి సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు.
సిట్ మోపిన అభియోగాలు నిజమేనని ఏసీబీ న్యాయస్థానం నమ్మడంతో ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు.నిన్న రాత్రి ఒంటి గంటకు చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ రాజ మహేంద్ర వరం సెంట్రల్ జైలుకు చేరుకుంది.
అయితే చంద్రబాబును 23 నంబర్ సెంటిమెంట్ వెంటాడుతోందని కొత్త వాదన తెరపైకి వచ్చింది.చంద్రబాబు ఖైదీ నంబర్ 7+6+9+1 = 23 కావడంతో కొంతమంది ఈ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు.2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోగా 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడం జరిగింది.
2019 ఎన్నికల ఫలితాలు సైతం మే నెల 23వ తేదీనే ప్రకటించారు.ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి 23 నంబర్ ను కొంతమంది పాజిటివ్ గా ఫీలైతే మరి కొందరు నెగిటివ్ గా ఫీలవుతారు.చంద్రబాబుకు జైలులోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు.
చంద్రబాబుకు అవసరమైన మందులు అందించడంతో పాటు వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
స్కిల్ స్కాం కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా బయటపడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందో లేదో చూడాల్సి ఉంది.
చంద్రబాబు అరెస్ట్ కావడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.పెళ్లి రోజునే భర్త అరెస్ట్ కావడం భువనేశ్వరిని ఎంతగానో బాధ పెడుతోందని తెలుస్తోంది.