అవును, మీరు విన్నది నిజమే.150 కిలోల బరువుగల మందుపాతరలతో సెకెన్ల వ్యవధిలోనే ఓ బ్రిడ్జి ( Bridge ) నేలమట్టమైన ఘటన జర్మనీలో చోటు చేసుకోగా దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.అయితే ఆ బ్రిడ్జిని ఎందుకు అలా కూల్చేశారు అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ పూర్తి కధనాన్ని చదవాల్సిందే.లుడెన్‌స్కీడ్‌లోని రమీడ్ వ్యాలీలో ఉన్న ఈ బ్రిడ్జిని 1965, 1968 మధ్య నిర్మించడం జరిగింది.
అయితే దీనికి కొన్నాళ్ల క్రితం పగుళ్లు రావడంతో దానిని కొద్ది కాలంగా మూసివేశారు.
ఈ క్రమంలో దానిపైనుండి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు.ఈ క్రమంలోనే ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.అయితే ఆ సమయంలో చుట్టుపక్కల ఇళ్లు, భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని బ్రిడ్జిని కూల్చివేసినట్టు అక్కడి స్థానిక మీడియాలు కధనాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో ఈ బ్రిడ్జి వివరాలను కూడా చెప్పుకొచ్చారు.
ఇది చాలా పురాతనమైనదని, దాదాపు 56ఏళ్లకు పైగానే ఇది పని చేసిందని తాజాగా అది బలహీనపడడంతో అక్కడి ప్రభుత్వం సాయంతో కూల్చివేయడం జరిగిందని అక్కడ నిర్వాహకులు చెప్పారు.450 మీటర్ల పొడవైన ఈ వంతెనను నేలమట్టం చేసేందుకు 150 కిలోల పేలుడు పదార్థాలను( 150kg Explosives ) ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు.కాగా ఈ బ్రిడ్జి కూల్చివేత విషయం ముందుగానే అక్కడి స్థానికులకు తెలియడంతో దానిని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది అక్కడకు తరలివెళ్లారు.
కాగా ఆ సమయంలో ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో అవి వైరల్‌గా మారాయి.