గత ఏడాది కరోనా సమయంలో దాదాపు అన్ని సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఇక వాయిదా పడ్డ సినిమాలన్నీ లాక్ డౌన్ నిషేధం తర్వాత మొదలు కాగా ఈ ఏడాది వరుస సినిమాలు వరుస స్టార్ లతో రానున్నాయి.
అంతేకాకుండా మెగా కుటుంబం నుంచి 14 సినిమాలు ఈ ఏడాది విడుదల కు సిద్ధంగా ఉండగా.మొత్తానికి 2021 మెగా ఇయర్ గా మారనుంది.
మెగా ఫ్యామిలీ మెగా స్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం నుంచి మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నా ఆచార్య సినిమాలో నటించగా అందులో రామ్ చరణ్ ఓ గంటసేపు ఉండేలా చేశారట.ఈ సినిమా మే లో విడుదల కానుంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుండగా.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.
ఇక మరో సినిమా అయ్యప్పనుమ్ కొషియుమ్ సినిమాలు బిజీగా ఉండగా ఈ ఏడాదిలో విడుదల కానుంది.
ఇక రామ్ చరణ్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో నటించగా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుందని తెలిపారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో నటించగా.
ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా జులై 30న, సాయి ధరమ్ తేజ్ దేవా కట్టా రిపబ్లిక్ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
కొత్త దర్శకుడు తో వస్తున్న అల్లు శిరీష్ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని సినిమాతో ఈ ఏడాది వస్తున్నాడు.
మొత్తానికి మెగా అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.